గద్వాల్ జమ్మిచేడు లో సంపూర్ణ సురక్ష HIV/AIDS క్యాంప్

Feb 20, 2024 - 16:43
 0  6
గద్వాల్ జమ్మిచేడు లో సంపూర్ణ సురక్ష HIV/AIDS క్యాంప్
గద్వాల్ జమ్మిచేడు లో సంపూర్ణ సురక్ష HIV/AIDS క్యాంప్

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలో జమ్మిచేడు లో తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశానుసారం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన/హెల్త్ క్యాంప్ పెట్టడం  జరిగినది. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా dy DM&HO Dr సిద్దప్ప  మధుసూదన్ రెడ్డి, కృష సాగర్  మరియు ICTC కౌన్సిలర్ ఫరిధ్ రావడం జరిగింది . Dr సిద్దప్ప  మాట్లాడుతూ... ఈ వ్యాధి అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి మరియు ఇది నాలుగు రకాలుగా వస్తుంది ఆశృషిత లైంగిక సంబంధముల ద్వారా రక్త మార్పిడి ద్వారా, తల్లి నుండి బిడ్డకు, సూదులు సిరంజీల ద్వారా వస్తుంది. యువత తప్పుదారి పట్టకుండా మంచి దారిలో నడవాలని మాదక ద్రవ్యాలు అలవాటు కాకుండా ఉండాలని తెలియజేయడం జరిగినది.

 ప్రతి గర్భిణీ స్త్రీలు హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి, ఎవరికి అయినా అనుమానం ఉంటే దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఐసిటిసి సెంటర్ ని సందర్శించండి వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. సందేహాలు సలహాల కోసం 1097 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృతం చేసుకోగలరు. ఈరోజు క్యాంప్ లో 65HIV టెస్టులు చేయటం జరిగింది .
ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగినది  .ఈ కార్యక్రమంలో హెూప్ ఎన్జిఓ ప్రోగ్రాం మేనేజర్ ఉదయ్ శేఖర్ మరియు గద్వాల్ జిల్లా ఇంఛార్జి లక్ష్మి నారాయణ సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333