కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసయ్య స్మారకస్తుపనిర్మాణానికి

Jun 9, 2024 - 20:47
Jun 10, 2024 - 10:17
 0  56
కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసయ్య స్మారకస్తుపనిర్మాణానికి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- అలుగుబెల్లి వెంకట నరసయ్య స్మారకస్తుపనిర్మాణానికి సహకరించండి. _ *సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్ పిలుపు.* కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నుండి తొలితరం విప్లవోద్యమ నాయకుడిగా రైతు కూలీ సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఎనలేని కృషి చేసి ముఖ్య పాత్ర పోషించాడని *సిపిఐ( ఎం_ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం .డేవిడ్ కుమార్ అన్నారు.* ఈరోజు తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో అలుగుబెల్లి స్మారక స్తూప నిర్మాణానికి ఆర్థిక, హార్దికంగా సహకరించాలంటూ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ అలుగుబెల్లి గారు ఉన్నత వర్గ కుటుంబంలో జన్మించిన తాను అసమానతలు లేని వ్యవస్థ కావాలని, అన్ని రకాల వివక్షతలు రద్దు కావాలంటూ తన పేరున చివరిలో కులం సూచించే నామాన్ని వదిలేసుకొని అలుగుబెల్లి వెంకట నరసయ్యగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు. నిజాం, రాజకార్ లు ప్రజల్ని పీడించే విధానాలను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. అనేక నిర్బంధాలను, జైలు శిక్షలను అనుభవించి తన చివరి శ్వాస వరకు విప్లవోద్యములో కొనసాగాడని కొనియాడారు. అటవీ, మైదాన ప్రాంతంలో ఉద్యమాలపై వస్తున్న నిర్బంధాలను ఎదుర్కోవటానికి ఉద్యమ రక్షణ కోసం, కార్యకర్తలకు కాపాడుకోవడానికి తీవ్రమైన కృషి చేశాడని అన్నారు. కల్లోలిత కరీంనగర్ ప్రాంతానికి పార్టీ వెళ్లాలని నిర్ణయిస్తే వెనకాడకుండా ఆ ప్రాంతానికి వెళ్లి పని చేశాడని అన్నారు. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడని, పార్టీ సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలంటే వెనకాడకుండా రాజీనామా చేసి పూర్తిగా కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం పోరాడాలని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. *ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ కుమార్, సబ్ డివిజన్ నాయకులు నల్గొండ నాగయ్య, పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సక్క, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, పిడిఎస్ యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పార్టీ గ్రామ నాయకులు అల్లి వీరయ్య, మల్లయ్య, వెంకన్న,రాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.*