కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలయ్యే దెప్పుడు
బిజెపి రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య
నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి
చిన్నంబావి మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య
మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ
చిన్నంబావి మండలం 01అక్టోబర్ 2025 తెలంగాణ వార్త
చిన్నంబావి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో బిజెపి పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గరి శ్రీధర్ రెడ్డి, మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య, ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికoగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత సిలిండర్, ఇస్తున్నాo అంటూ చెప్తున్నారు కానీ గ్రామాలలోని స్థానిక సమస్యలపై అభివృద్ధి పనుల విషయంలో పట్టించుకోవడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలైన దాఖలాలు లేవన్నారు. మహిళలకు 2500 భృతి, రాజీవ్ యువ వికాసo పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఏటా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15 వేలు వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం అన్ని చెప్పి అమలు పరచలేదన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పింఛన్ రూ.4వేలకు పెంచుతాం అన్నారు కానీ అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. “పేదల సొమ్ముతో పెద్దల బడా బాబులా అప్పు మాఫీ” చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అన్నారు. పెద్దల అప్పులను మాఫీ చేస్తూ, పేద ప్రజల డబ్బును వృథా చేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజా పనుల రూపంలో వినియోగించాల్సిన నిధులు అని, పెద్దల బాకీలు తీర్చడం దారిదాప్యం కాదా అని ప్రశ్నించారు. హిందువుల పండుగల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి హిందూ పండుగలకే బస్సు ఛార్జీలను 50% పెంచడం, మరోవైపు మహిళలకు ఆధార్ చూపిస్తే ఉచిత ప్రయాణం ఇస్తామనే వాగ్దానం చేసి, వాస్తవానికి భార్య ఉచితంగా వెళ్తే భర్తపై పూర్తి భారం మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలకు అదనంగా భారం మోపడం హిందువుల పట్ల అన్యాయమని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య మాట్లాడుతూ ఒక చేతితో ఉచితమని చెప్పి, మరో చేతితో భారాన్ని పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా క్షమిస్తారు అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ప్రజలందరూ బీజేపీ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య, జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షులు కేతపగ విజయకుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ, ఉగ్ర నరసింహ, మండల ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి, నoది శేఖర్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, పసుల గోపాల్ నాయుడు, వెల్టూరు నాగ మద్దిలేటి, కత్తి రాజు, తగరం బాలక్రిష్టి, తదితరులు పాల్గొన్నారు.