ఓటర్లను భయపడితే క్రిమినల్ కేసులు తప్పవు..... ఎస్సై ప్రవీణ్ కుమార్

Dec 8, 2025 - 19:40
Dec 9, 2025 - 20:03
 0  0
ఓటర్లను భయపడితే క్రిమినల్ కేసులు తప్పవు..... ఎస్సై ప్రవీణ్ కుమార్

మునగాల 08 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఈనెల 14న జరగబోయే పోలింగ్ సందర్భంగా ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన మండల ప్రజలకు సూచించారు.పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు మండల వ్యాప్తంగా గ్రామాలలో భద్రత పెంచామన్నారు. ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మండల ప్రజలను ఎస్సై కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో మండల వ్యాప్తంగా పోలింగ్ నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్సై మండల ప్రజలను కోరారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State