ప్రభుత్వ ఆసుపత్రికి నీటి శుద్ధికరణ యంత్రం బహుకరణ
మునగాల 08 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- దాతల సహకారం మరువలేనిదని మునగాల వైద్యాధికారి రవీందర్ అన్నారు. సోమవారం బరాఖతూడెం గ్రామానికిచెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రవి- రమాదేవిల మనుమరాలు అన్షి పుట్టినరోజును పురష్కరించుకుని వైద్య సిబ్బంది, రోగుల అవసరాల కోసం సుమారు 15వేల రూపాయల విలువగల నీటిశుద్ది యంత్రాన్ని అందజేయడం చాల సంతోషకరమన్నారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వాసుపత్రిలో మౌళిక సదుపాయల కల్పనకు పాటుపడాలని అన్నారు. అనంతరం రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రవిని వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి స్రవంతి, సిబ్బంది జ్యోతి, మానస, స్వాతి, మంగమ్మ, జగ్గయ్య, నాయకులు కాలేరాజా, బోనాల శ్రీధర్ పాల్గొన్నారు.