ఉత్తమ అంగన్వాడి సూపర్వైజర్ గా కందుకూరి మంగ లక్ష్మయ్య

Mar 10, 2026 - 16:10
Mar 17, 2026 - 13:20
 0  286
ఉత్తమ అంగన్వాడి సూపర్వైజర్ గా కందుకూరి మంగ లక్ష్మయ్య

తిరుమలగిరి 10 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :-  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలనికి చెందిన కందుకూరి మంగ లక్ష్మయ్య ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్ గా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో  అంగన్వాడి సూపర్వైజర్ గా ఎంపికైన కందుకూరి మంగ లక్ష్మయ్య జాయింట్ కలెక్టర్ సీతారామారావు ASP రవీందర్ రెడ్డి చేతుల మీదుగా మండల ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్ గా ప్రశంస పత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. ఉత్తమ అవార్డు అందుకున్న మంగ లక్ష్మయ్య ను అతిథులు అభినందించారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి