ఐజ పట్టణ 06 వ వార్డ్ తుప్పత్రాల కౌన్సిలర్ కురువ ఆంజనేయులు & గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
జోగులాంబ గద్వాల 23 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: వడ్డేపల్లి. ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, అలంపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్... నివాసంలో....
టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి & ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జయన్న ల ఆధ్వర్యంలో..
ఐజ పట్టణం 06 వ వార్డ్ (తుప్పత్రాల) కౌన్సిలర్ కుర్వ ఆంజనేయులు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన,సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్న సందర్భంలో...సంపత్ కుమార్ నాయకత్వంలో రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం అని ఒక ప్రకటనలో వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తుప్పత్రాల గ్రామ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.