జిల్లాస్పత్రిలో ఈరోజు కొత్త ఎన్సిడి క్లినిక్ ను ప్రారంభించిన డిఎంహెచ్ఓ:- డాక్టర్ ఎస్ కే సిద్దప్ప.
జోగులాంబ గద్వాల23 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జిల్లా ఆస్పత్రిలో ఈరోజు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప .. కొత్త ఎన్సిడి క్లినిక్ను.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. ఇట్టి ప్రారంభోత్సవానికి జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంధ్యా కిరణమై, జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ , జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ హృశాలి మేడం , మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్ హెచ్వోడి, పలువురు డాక్టర్లు.. డాక్టర్ వంశీ, డాక్టర్ ప్రదీప్ కుమార్, ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు... అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఈరోజు నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన అబ్నార్మల్.. వారిని. మరియు 30+ వారిని స్క్రీనింగ్ చేయాలని, కొత్త ఫార్మట్స్ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు.. బీపీ షుగర్ మరియు క్యాన్సర్లకు సంబంధించిన రిపోర్టులను స్టేట్ కు రోజురోజు నివేదిక పంపాలని... సూచించారు.. అనంతరం వచ్చిన అతిథులకు శాలువా బొకేలతో సన్మానించడం జరిగింది... ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్, గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్ సూపర్వైజర్లు, పిహెచ్ఎన్ భారతి, స్టాఫ్ నర్సులు, నాగమ్మ, రేణుక, నిర్మల, ఫార్మసిస్ట్, ఎన్సీడీ సిబ్బంది పాల్గొన్నారు....