సూర్యాపేట గ్రంధాలయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన.....జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి

సూర్యాపేట 23 జనవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల గ్రంధాలయంలో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగుల సౌకర్యార్థమై హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ పౌండేషన్ సహకారంతో అన్న పూర్ణ రూ 5 మధ్యాహ్నం బోజనాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రంధాలయ సంస్త చైర్మన్ వంగవీటి రామారావు తెలియజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంధాలయంలో రూ 5తో అందించనున్న మద్యాహ్న భోజనాన్ని ప్రారంభించి సందర్భంగా వారు మాట్లాడారు. ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగుల సమయం వృదా కాకుండా ఉండేందుకు మద్యాహ్న భోజనాన్ని గ్రంధాలయంలో తక్కువ ధరలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బాలమ్మ, శ్రావన్ కుమార్, లైబ్రేరియన్లు శ్యాంసుంధర్ రెడ్డి, కె. విజయబాస్కర్, సృజన, హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ నిర్వాహకులు, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.