ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందో?

Mar 10, 2025 - 19:35
 0  4
ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందో?

అడ్డగూడూరు10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు హాజరైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా క్రింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించబడిన డా"అద్దంకి దయాకర్ కి,విజయశాంతికి,కేతావత్ శంకర్ నాయక్ కి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ నేతల బృందం కార్యక్రమంలో అడ్డగూడూరు పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి టి.పి.సి.సి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలెంల సైదులు,కేసరపు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మిడి ఉపేందర్ రెడ్డి,చింతల ఉపేందర్ రెడ్డి,పూజారి నరసింహ యూత్ కాంగ్రెస్ అడ్డగూడూరు మండల ఉపాధ్యక్షులు మేకల పవన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333