బొడ్డుగూడెం గ్రామంలో విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా

అడ్డగూడూరు10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించరు.సోమవారం రోజు విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర పోషించారు.డిఇఓగా అలెక్స్, ఎంఈఓగా జెస్మిత,హెడ్మాస్టర్గా కుందన, ఏ ఏ పి సి చైర్మన్ నికిత, ఉపాధ్యాయులుగా సాక్షిత,సెయింట్ పాల్,అలెక్సియా పాత్ర పోషించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొడిశాల నాగరాజు మాట్లాడుతూ..నేటి బాలలే రేపటి పౌరులు అని,ఇలానే జీవితంలో ఉన్నతమైన ఉపాధ్యాయులుగా ఎదగాలని చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు పొన్నాల శేఖర్,ఏ ఏ పి సిచైర్మన్ కొమ్ము దేవేంద్ర శ్రీను,మాజీ స్కూల్ మాజీ చైర్మన్ బాలరాజు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.