ప్రమాదంలో భారత రాజ్యాంగం
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.
బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపొగు రాంబాబు
జొగులాంబ గద్వాల 26నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల భారత రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆగిపోగు రాంబాబు అన్నారు. ప్రాథమిక హక్కులు, నైతిక విలువలు, రిజర్వేషన్లు, ఓటు హక్కు, విద్యాహక్కు చట్టాలను భారత రాజ్యాంగము మనకు అందించిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం ఇటిక్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పాలనలో భారత రాజ్యాంగము ప్రమాదంలో ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి పరోక్షంగా రిజర్వేషన్లను తీసేయడానికి కేంద్ర ప్రభుత్వము కుట్రలు చేస్తుందన్నారు . దేశంలోని ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కులను తీసేస్తామని బహిరంగంగా కేంద్ర ప్రభుత్వము ప్రకటనలను చేస్తుందన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందిన హక్కులను కాల రాయడానికికేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కురువ రామకృష్ణ , అడ్వకేట్ యాకోబ్ , జాన్, అబ్రహాము, గోపి, రాజు , దావీదు తదితరులు పాల్గొన్నారు.