ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక పాత్ర వహించాలి...
ఎమ్మెల్సీ ఎన్నికల కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
ఎమ్మెల్సీ ఎన్నికల కోరుట్ల నియోజకవర్గం కోఆర్డినేటర్ బాషా వేణు యాదవ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల 22 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలక పాత్ర వహించాలని కోరుట్ల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ వరంగల్ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్ లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికలపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రవీందర్ మాట్లాడుతూ ఈనెల 27న జరిగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ మహిళా కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 గంటలు నిరంతరాయం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారన్నారు గత ప్రభుత్వాలకు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలే గమనించాలన్నారు
ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయడమే కానీ ప్రమోషన్లు ఉండేది కావని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రమోషన్లు బదిలీలు చేపట్టడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు 6500 కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మొదటి తేదీనే జీతాలు అందిస్తున్నామని గత ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిట్మెంట్తో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నారు కమిట్మెంట్ ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కావున మేధావులు విద్యావంతులు ఆలోచించాలని కోరారు నరేందర్ రెడ్డి ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రేపు ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నామని గత ప్రభుత్వాలు పదేళ్లలో చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ తో ఉద్యోగ కల్పన చేపట్టడం జరిగిందన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ ద్వారా 11 రకాల సరుకులను అందిస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక బియ్యాన్ని మాత్రమే సరఫరా చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు నరేందర్ రెడ్డి గెలుపులో ఎక్కడ ఎక్కువ మెజారిటీ వస్తే అక్కడ అభివృద్ధి అనేది ఎక్కువ జరుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెజార్టీ దిశగా కృషి చేయాలన్నారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రశ్నించే గొంతుకగా జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించామని అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి ని కూడా అదే విధంగా గెలిపించాలని కోరారు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 లక్షల 45 వేల కోట్లు ఉంటే కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1 లక్ష 45 వేల ఓట్లు ఉన్నాయన్నారు అలాగే కోరుట్ల నియోజకవర్గంలో సుమారు 8763 ఓట్లు ఉన్నాయని అందులో 8 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడచిన 11 నెలల్లో 54 వేల ఉద్యోగాల భర్తీ చేయడం జరిగిందని కావున కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు గడచిన పది సంవత్సరాల్లో ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లుగానే ప్రమోషన్లు చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు చేపట్టినడం జరిగిందని తెలిపారు కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ మహిళా కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ విభాగాల నేతలు కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి కులమతాలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నారని తెలిపారు ప్రతిపక్షాలు లక్ష రూపాయల ఖర్చు చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అర్పించారు కాంగ్రెస్ సోషల్ మీడియా అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టే విధంగా కృషి చేయాలన్నారు నరేందర్ రెడ్డి విద్యారంగానికి ఎంతో సేవ చేస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో డిఎస్సీ ద్వారా 60 రోజుల్లోనే 8500 ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు వివా వికాసం ద్వారా 52 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని ఆయన గతంలో ఇండ్లలోకి వెళ్లి ట్యూషన్ చెప్పేవారని సుమారు 20 30 కిలోమీటర్ల దూరం వెళ్లి ట్యూషన్ చెప్పిన గొప్ప వ్యక్తి నరేందర్ రెడ్డి అన్నారు అలా అంచలంచలుగా ఎదుగుతూ ఆంధ్ర కళాశాలలను తెలంగాణకు రాకుండా అడ్డుకట్ట వేయడంలో ఎంతో కృషి చేశారని ఆల్ ఫోర్స్ కళాశాలను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారన్నారు నరేందర్ రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమ్యాల వాస్తవ్యులు అన్నారు కావున రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో రెండో నెంబర్ పై ఉన్న కాలంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలో సుమారు 3900 ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కృషి చేయాలని కోరారు నరేందర్ రెడ్డిని గెలిపించుకుంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కావున నాయకులు కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలని కోరారు అనంతరం వేణు యాదవ్ మాట్లాడుతూ ఈ పట్టభద్రుల ఎన్నిక ప్రతిష్టాత్మకమైనదని బిఆర్ఎస్ అభ్యర్థి నిల్పకుండా బిజెపికి సపోర్ట్ చేస్తుందన్నారు నరేందర్ రెడ్డి మంచి విద్యావేత్త ఎంతోమందికి విద్యను అందించి వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించిన నాయకుడని కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగిందని కావున ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత జిల్లా ఉపాధ్యక్షురాలు సోగ్రాభి ఎంబేరి సత్యనారాయణ చిటి మేల్లి రంజిత్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్మన్ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ పుప్పాల ప్రభాకర్ ఎంబెరి నాగభూషణం సంఘ లింగం చిట్యాల లక్ష్మీనారాయణ ఎడ్ల రమేష్ పసుల కృష్ణ ప్రసాద్ సదుల తెడ్డు విజయ్ పాషా చంద్రశేఖర్ అజయ్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు