శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు

Mar 10, 2024 - 19:41
Mar 10, 2024 - 20:30
 0  5
శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు

తుంగతుర్తి:మర్చి10 తెలంగాణవార్త ప్రతినిధి :- శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల ను ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు ఆధ్వర్యంలో    తుంగతుర్తి మండల  కేంద్రంలో ని సిరి ఫంక్షన్ హాలులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రధమంగా మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి సిరి ఫంక్షన్ హాల్ వరకు సంత్ సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లంబాడీల నాయకులు మాట్లాడుతూ కొండల మధ్యన  తండాలలో జీవిస్తున్న లంబాడీల జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి సంతు సేవాలాల్  అని అతనిని కొనియాడినారు.  ఇతడు బాల్యం నుంచి వైద్య చింతన మరియు ఇతరుల పట్ల దయాగుణం చూపే వాడని అన్నారు.  లంబాడి జాతుల సంస్కృతిని సంప్రదాయాలని కాపాడేటందుకు కృషి చేసినాడు అని అన్నారు. అందువలన అతనిని లంబాడి జాతుల ఆరాధ్య దైవంగా భావిస్తున్నామని తెలిపినారు. చివరగా పలువురు బంజారా నాయకులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజుని సాల్వాలతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జయపాల్ నాయక్, అంబటి రాములు, నాగు నాయక్ శ్రీకాంత్ నాయక్, గిద్దె రామ నరసయ్య, దారా సింగ్ తదితర గిరిజన ప్రముఖులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333