ఎన్నికల భద్రతపై జిల్లా పోలీసుల సిద్ధతను పరిశీలించిన డి.ఐ.జి. చౌహాన్
జోగులాంబ గద్వాల 3 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల రాష్ట్రవ్యాప్తంగా జరుగుచున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జోగుళాంబ గద్వాల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షిస్తూ, జోగుళాంబ జోన్ డి.ఐ.జి. ఎల్.ఎస్. చౌహాన్ ఈ రోజు గద్వాల్ జిల్లాను విసిట్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులు ఇచ్చిన వివరాలను విశ్లేషించి, పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకూడదనే దృక్పథంతో స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“ఎన్నికల సమయం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక దశ. ప్రతి ఓటరు భయపడకుండా, స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడం పోలీసుల ప్రాధాన్య భాద్యత.”
అని చెప్పారు. జిల్లాలోని సున్నితమైన, అతి సున్నిత బూత్‌ల పరిస్థితిని అధ్యయనం చేసిన డి.ఐ.జి. ప్రత్యేక పహారా బృందాలు, రాత్రి నిఘా, ఇంటెలిజెన్స్ సేకరణపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు లేదా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా పెండింగ్ వారెంట్లు, బైండోవర్ కేసులు, దుర్మార్గుల కదలికలపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, చట్టవిరుద్ధ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన బందోబస్తు ప్రణాళికలను డి.ఐ.జి. కి వివరించిన జిల్లా ఎస్పీ, శాంతి భద్రతలను విషయంలోను అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.
సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, అదనం ఎస్పీ కె. శంకర్, గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.
...