ప్రజలు, అభ్యర్థులు శాంతియుతంగా – నమ్మకంగా – చట్టపరంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనండి

Dec 3, 2025 - 20:35
 0  4
ప్రజలు, అభ్యర్థులు శాంతియుతంగా – నమ్మకంగా – చట్టపరంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనండి
ప్రజలు, అభ్యర్థులు శాంతియుతంగా – నమ్మకంగా – చట్టపరంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనండి

"మీ భద్రత... మా బాధ్యత ... అండగా ఉంటాం!..  జిల్లా ఎస్పీ”

 జోగులాంబ గద్వాల 3 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ నుంచి మూడో విడత నామినేషన్ ప్రారంభం వరకు కట్టుదిడ్డమైన పర్యవేక్షణలో గద్వాల జిల్లా. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ మరియు మూడో విడత నామినేషన్ ప్రారంభ ప్రక్రియ ఒకేరోజు జరుగుతున్న వేళ జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు జిల్లా ప్రజలను, అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శాంతియుతంగా, నమ్మకంగా, చట్టపరంగా ఎన్నికల లో పాల్గొనాల్సిందిగా కోరారు. ఇట్టి ప్రక్రియలో మీ భద్రత కు మాదే బాధ్యత ఎక్కడైనా ఎవరైనా ఒత్తిడికి గురి చేస్తే ఫిర్యాదు చేయండి అండగా ఉంటాము అని తెలిపారు.

ఇటిక్యాల, ఎర్రవల్లి, అల్లంపూర్, మానవపాడు, ఉండవెల్లి గ్రామాల్లో మూడో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల వాతావరణం మరింత చురుకుగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎర్రవల్లి పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ఉద్రిక్తతలేమీ లేకుండా కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అని, అభ్యర్థులు భయం లేకుండా – ఒత్తిడి లేకుండా – స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకోవడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ గారు తెలిపారు.

ముఖ్యంగా మొదటి విడత నామినేషన్‌ల ఉపసంహరణకు ఈరోజే చివరి తేదీ కావడంతో, ఎవరి మీదా ఒత్తిడి లేదా బలవంతం చేయరాదని పోలీసులు హెచ్చరించారు. ఎవరు అభ్యర్థులను బెదిరించడం, ఆపడం, ఒత్తిడి చేయడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్రమైన నేరమని స్పష్టంగా చెప్పారు.

అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యులపై ఎవరైనా ఒత్తిడి చేస్తే, బెదిరిస్తే లేదా ఉపసంహరణకు బలవంతం చేస్తే వారు తక్షణం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు, వెంటనే చర్యలు తీసుకోవడానికి  సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333