ప్రపంచ వికలాంగుల దినోత్సవ ర్యాలీ
- జిల్లా వికలాంగుల సేవా సంఘం అధ్యక్షుడు చంటిబాబు
జోగులాంబ గద్వాల3డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వివిధ మండలాల నుండి వికలాంగుల సోదరీ సోదరా మ ణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే పాత బస్టాండు,గాంధీ చౌక్, రాజీవ్ మార్క్,కొత్త బస్టాండు, కృష్ణవేణి చౌ, మీదుగా ర్యాలీ నిర్వహించారు. మరియు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సంద ర్భంగా అధ్యక్షుడు చంటి బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వికలాంగుల పట్ల చట్టసభలో అన్ని అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. విద్యా, వైద్యం, నిరు ద్యోగిత, జీవనోపాధి, ప్రభుత్వ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్, కల్పించాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచంలో 193 దేశాలు వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 ను ప్రతి దేశం కూడా జరుపుకుం టున్నారని ఆయన తెలియపరి చారు వికలాంగులు అనేవారు సమాజంలో తక్కువ ఏం కాదని, అలాగే సకలాంగులతో, వికలాంగు లు ఛాలెంజ్ చేస్తూ.. అన్ని రంగాల లో.. వికలాంగులు రాణిస్తున్నారు అని గుర్తు చేశారు. అలాగే వికలాం గులు అనేవారు సమాజంలో ఆత్మవిశ్వాసంతో, పట్టుదల, శక్తి సామర్థ్యాలతో, సొంతంగా తమ పనులు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ మండలాల వికలాంగుల సోదరి సోదరా మనులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు.