ఎంపీని కలిసిన రాఘవాపురం సర్పంచ్

Dec 27, 2025 - 06:57
 0  172
ఎంపీని కలిసిన  రాఘవాపురం సర్పంచ్

తిరుమలగిరి 27 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన తిరుమలగిరి మండలం రాఘవాపురం సర్పంచ్ ధరావత్ చిరంజీవిని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామా సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుబాటులో ఉన్న అన్ని పథకాలు, నిధులు సద్వినియోగం అయ్యేలా తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాఘవాపురం కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి