పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు 

Jul 13, 2024 - 17:36
 0  10
పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు 

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురికి ముగ్గురు పాము కాటుకు గురయ్యారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులు పనిచేస్తున్న మైనర్ బాలుడు గోనపాడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్, కేటి దొడ్డి మండలం తూర్పు తాండాకు చెందిన సంతోష్ నాయక్, ఐజ మండలం తనగల గ్రామానికి చెందిన అర్జున్ కుమార్, గద్వాల కు చెందిన వీరేంద్ర చార్యులను చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ అధికారులు పట్టుకొని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వదిలారు. ఈ నలుగురు విద్యార్థులు శనివారం మూత్ర విసర్జనకు వెళ్లారు. అక్కడ పాముకాటు గురి కావడంతో హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యంగా ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యం పై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333