ఉద్యోగంలో చేరిన నాడే పదవి విరమణ ఖరారు అవుతుంది ఎల్ ఎఫ్ ఎల్

Jun 1, 2025 - 21:23
Jun 2, 2025 - 16:36
 0  2
ఉద్యోగంలో చేరిన నాడే పదవి విరమణ ఖరారు అవుతుంది  ఎల్ ఎఫ్ ఎల్

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ ఉద్యోగంలో చేరిన నాడే పదవి విరమణ ఖరారు అవుతుంది ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు వివి నాయక్ ఆత్మకూర్ ఎస్.. : ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరిన నాడే పదవి విరమణ తేదీ ఖరారు అవుతుందని ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు వాంకుడోత్ వెంకన్న నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఊర్మిళ పదవి విరమణ పొందడంతో నెమ్మికల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఆత్మీయ సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు పనిచేస్తారని గుర్తు చేశారు. తాము విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా నిత్యం కృషి చేస్తామని అన్నారు. ఊర్మిళ కు ఉద్యోగ విరమణ లభించిందిని రానున్న రోజుల్లో సుఖ సంతోషాలతో ఉండి సమాజసేవలో భాగస్వామి కావాలని కోరారు. అనంతరం ఊర్మిళను పూలమాలలు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు విమల, దీన రాణి, అంజయ్య, నందన్ కుమార్, రఘుపతి, రామయ్య, నాగేశ్వరరావు, నీరజ తదితరులు పాల్గొన్నారు.