35 ఏండ్ల తర్వాత కలయిక

Jun 1, 2025 - 21:24
Jun 2, 2025 - 16:36
 0  5
35 ఏండ్ల తర్వాత కలయిక

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ 35 ఏండ్ల తర్వాత కలయిక. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19 89-90 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత ఆదివారం సమ్మేళనం నిర్వహించి తమ మధురానుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాటి పూర్వ విద్యార్థులు పాఠశాలలో తమ జ్ఞాపకాలను అనుభవాలను నేటి జీవన విధానాలను కుటుంబసభ్యులను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాటి గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పుప్పాల వీరన్న దాసరి శ్రీనివాస్ వారాల శ్రీను ఎరగాని రమేష్ మిర్యాల లింగారెడ్డి సత్యనారాయణ చారి పోతులూరి అజ్మత్ హుస్సేన్ సోమిరెడ్డి విజయలక్ష్మి స్వరూప ఉపేంద్ర సుకన్య సుధా మల్లారెడ్డి జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు