ఈత సరదా విషాదం కాకూడదు..... 

Mar 22, 2024 - 19:45
Mar 23, 2024 - 00:37
 0  5
ఈత సరదా విషాదం కాకూడదు..... 

తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల, చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి.

ఈత వచ్చిన కుటుంభ సభ్యుల సంరక్షణ లోనే  చిన్నారులు బావులు,  చెరువులు, కాలువలు, కుంటల దగ్గరకు వెళ్లాలి

స్కూల్ కు వెళ్ళిన పిల్లలు సాయంత్రము వరకు ఇంటికి రాక పోతే వెంటనే డయల్ -100 కు సమచారం అందించండి

జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ IPS గారు .
 

వేసవికాలం సందర్భంగా ఒంటిపూట బడులు ప్రారంభం కావడంతో  ఎంతో మంది చిన్నారులు, యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   జలాశయాల వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణలు కోల్పోయో ప్రమాదం ఉందనీ కావున పాఠశాల నుండి వచ్చిన తమ పిల్లల పై తల్లిదండ్రులు  దృష్టి పెట్టాలని, ఈత సరదా కుటుంబాలలో విషాదం కాకుండా  తగు జాగ్రత్తలు తీసుకోవాలని  జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ ,IPS గారు జిల్లా ప్రజలకు సూచించారు.


 పాఠశాల సమయం పూర్తి అయ్యాక పిల్లలు ఇంటికి వచ్చారా లేదా  ఎక్కడికైనా స్నేహితులతో కలిసి వెళ్ళారా అనే విషయాలు తల్లి దండ్రులు గనించాలని, రోజువారీగా వచ్చే సమయానికి వారు రాకపోతే ఎక్కడికి వెళ్లారు అనే విషయాలు తెలుసుకోవాలని ఆచూకీ తెలియకపోతే వెంటనే పోలీస్ డయల్ - 100 కు కాల్ చేసి సమచారం అందిస్తే పోలీస్ అధికారులు  తగు చర్యలు తీసుకుంటారని ఎస్పీ గారు ప్రజలకు సూచించారు
ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత ను నేర్చుకునే చిన్నారులు, యువతి యువకులు   ఈత వచ్చిన వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యoగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, మహిళలు బట్టలు ఉతికేoదికు చెరువుల దగ్గరకు కుడా ఈత వచ్చిన కుటుంబ సభ్యుల వెంట మాత్రమే వెళ్ళాలని అన్నారు. చిన్న పిల్లలు స్కూల్స్ సమయం పూర్తి అయ్యక వారి కదలికల పై తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సిన అవసరము ఉందని అన్నారు. ఎండాకాలం లో ఈతకు వెళ్ళేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా గ్రామాలలో కళా బృందం ద్వారా అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333