యేసు క్రీస్తూ మరణం పై విజయమే 'ఈస్టర్"

Apr 20, 2025 - 16:34
Apr 20, 2025 - 16:35
 0  0
యేసు క్రీస్తూ మరణం పై విజయమే 'ఈస్టర్"

బేతెస్థ సంఘంలో పాదశుద్ది నిర్వహించిన బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా
       బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు

ఆదివారం 20 ఏప్రిల్ : సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4 వ వార్డు నందు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ప్రపంచ క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈస్టర్ పండుగ జరుపుకుంటారనీ అన్నారు.ప్రపంచం మొత్తంలో కాలిగా వున్నా సమాధి ఒక్క యేసుక్రీస్తు ప్రభుదే అనీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంతో మంది ప్రవక్త లు ప్రవచించిన విదంగా ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి చనిపోయి తిరిగిలేచడని అన్నారు. అనంతరం చర్చ్ లో యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగి సేవా చేసిన విధంగా ఈ రోజు సంఘం లో పాదశుద్ధి కార్యక్రమం చేసి మాదిరి చూపించారు. ఈ కార్యక్రమం లో యేసుపాదం, బాబు, కిరణ్, భాస్కర్, జానయ్య, సురేష్, పేతురు, అంజి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333