ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ళ ఆయుధాలు:సీఐ శ్రీను

Feb 1, 2025 - 19:29
 0  15
ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ళ ఆయుధాలు:సీఐ శ్రీను

జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మన ఆశలకు, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు అని గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీను గద్వాల సర్కిల్ ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేశారు.ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టకండి.ఎవరో చెప్పింది విని, లేదా సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోకండి. మీరు పెట్టుబడి పెట్టండి. మీ బంధుమిత్రులతో, విలాసవంతమైన వస్తువుల్ని ఇప్పిస్తామని, రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని, రకరకాల మాయమాటతో ఆఫర్లు, పెట్టి ప్రజల నుండి మొదట సభ్యత్వాలు స్వీకరించి, వారితో పాటు మరికొంత మందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తు, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగి వస్తాయి అని నమ్మించి ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు.కొత్త కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని అన్నారు. ఇలాంటి నూతన స్కీముల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలంటూ సీఐ శ్రీను సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు మీ క్యూ ఆర్ కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెబితే నమ్మకండి. అది సైబర్ నేలగాళ్ళ మోసం అని గ్రహించండి. ఆన్లైన్లో లోన్స్ గురించి, లోన్ కి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు, మీ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లు, ఫోటోలు, మీ వ్యక్తిగత వివరాలు, వ్యాపారం మీ అనుమతి లేకుండా తీసుకుంటారు. తర్వాత మీరు తీసుకున్న లోన్ కట్టిన ఎక్కువ డబ్బులు కట్టమని, ఆ వివరాలతో వేధింపులకు గురి చేస్తారు. ఇంకో ముక్యమైనా విషయం, కస్టమర్ నంబర్స్ ను సంబంధిత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. సైబర్ నేరగాళ్ళు గూగుల్ నందు నకిలీ కస్టమర్ కేర్ నంబర్స్ పెట్టి మోసాలకు పాలుపడుతున్నారు. కాబట్టి ఇలాంటి నేరాల పట్ల మొబైల్ ఫోన్లను చూసి మనకు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, మరియు ఈమెయిల్ ఫోన్ ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఇలాంటి మోసపూరిత కుట్రలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగవద్దు, మోసపోవద్దు. తొందరపడి బాధలను, కష్టాలను, కన్నీళ్లను కొని తెచ్చుకోవద్దు. లోన్ యాప్స్ వేధింపులకు, మీలో మీరు బాధపడవద్దు. క్షణికావేషాలకు మీ నిండు ప్రాణం బలి తీసుకోవద్దు. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మోసపోయిన వెంటనే, ఒక క్షణం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ, www.cybercrime.gov. ద్వారా కానీ లేదా, మీ సమీప పోలీస్ స్టేషన్ లోనైనా వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆలస్యం విషం, అత్యాశ కొంప ముంచుతుందనే నానుడి మాటలను, మనసా వాచా కర్మణా నమ్మండి అని గద్వాల సీఐ శ్రీను గద్వాల సర్కిల్ ప్రజలకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333