విరాట్ విద్యార్థిడుని చితకబాదిన కృష్ణవేణి ప్రైవేట్ పాఠశాల యాజన్యం పై చర్యలు తీసుకోవాలి, 10లక్షల జరిమానా విధించాలి
అధిక ఫీజులు అక్రమంగా వసూలు చేస్తూ,పేదలకు 25% ఉచితంగా సీట్లు ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి,పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలి
అయిజ మండల విద్యాశాఖ అధికారి రాములు కి వినతి పత్రం అందచేత
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్
జోగులాంబ గద్వాల1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అయిజ. మండలం కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి ప్రైవేట్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విరాట్ అనే విద్యార్థుడిని కట్టెతో టీచర్ చిదక బాధడం పట్ల తీవ్ర వ్యతిరేకంగా పరిగణించి పాఠశాల యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని పది లక్షల జరిమానా విధించాలని అయిజ మండల ఎంఈఓ రాములు కి వినతి పత్రం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ అందచేశారు. విద్యాహక్కు చట్టం కింద పిల్లల్ని వేధించడం, కొట్టడం,తిట్టడం నేరంగా పరిగణించి వారి మీద చర్యలు తీసుకోవాలని అధిక ఫీజులు వసూలు చేస్తూ మళ్లీ విద్యార్థుల మీద దాడులకు పాల్పడుతున్నారని అన్నారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు 25% ఉచితంగా సీట్లు పేదలకు ఇవ్వాలని అలా ఇవ్వని అయిజ ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకొని పాఠశాల ల అనుమతులు రద్దు చేయాలని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యాహక్కు చట్టం 2009 ను ఉల్లంఘిస్తున్నారని సెక్షన్ 12 ప్రకారం నిరుపేద ఎస్సీలకు 10% ఎస్టిలకు 4% బీసీలకు 6% అనాధలకు, దివ్యాంగులకు 5% మొత్తం 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి కానీ ఆ విధంగా ఇవ్వకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ అయిజ లో విద్యా వ్యవస్థని వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలలో క్యాపిటల్ ఫీజు పుస్తకాలు, యూనిఫామ్, షూస్ చట్టం నిబంధనలను అతిక్రమించి విక్రయిస్తున్నారని అన్నారు,అనుమతులు లేకుండా పాఠశాలలను -నడపడం,సరైన ప్లేగ్రౌండ్ లేకుండా, ఫైర్ లేకుండా, ఎగ్జిట్ లేకుండా, డిఎడ్, బిఎడ్ ఉపాధ్యాయులతో బోధించకుండా అనేక విధాలుగా విద్య హక్కు చట్టం ను ఉల్లంఘన చేస్తూ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రైవేటు పాఠశాలల వ్యవస్థ జోగులాంబ గద్వాల జిల్లాలో నడుపుతున్నారని వీటి మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టీ చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు తక్షణమే 25 శాతం సీట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలని లేదంటే ప్రైవేటు పాఠశాలల విద్యా వ్యవస్థ పై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని అన్నారు.
ఈ కార్యకమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అయిజ మండల వైస్ ప్రెసిడెంట్ ఉప్పల ప్రవీణ్, విజయ్, నాయకులు ప్రభాకర్ గారు,రాజు, రవి తదితరులు పాల్గొన్నారు