రాజకీయ, ఎన్నికల బడ్జెట్ పేదలకు నిరాశ తెలంగాణకు మొండిచేయి
సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు విశ్లేషణ
జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సామాన్యులను , కష్ట్టజీవులను పట్టించుకోలేదు, తెలంగాణ రాష్ట్రాన్నికూడా పట్టించుకోలేదు, గద్వాల్ జిల్లా రైల్వే ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. వ్యాపారులకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, దేశ సమ్మిళిత అభివృద్ది బడ్జెట్ కాదు.సీతారామన్ బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోడానికే ఈ బడ్జెట్. ఎన్నికలు ఉన్నరాస్ట్రాలకు , రాజకీయా అవసరాలు ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణకు, గద్వాల జిల్లాకు మొండిచేయి చూపడం ఇక్కడి బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి. ఇది ఆశల బడ్జెట్ సామాన్యులకు ఉపయోగం లేని బడ్జెట్ అని ఆంజనేయులు సీపీఐ జిల్లా కార్యదర్శి అని అన్నారు.