ఆడపిల్లలను చదివించాలి - అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

Mar 8, 2024 - 19:39
 0  5
ఆడపిల్లలను చదివించాలి - అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
ఆడపిల్లలను చదివించాలి - అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

 ప్రకృతిలో స్త్రీ పురుషుడు సమానులే- ఆడ మగ వివక్షతను ఎండగట్టాలి

 ఆడవారు అబలలు కాదు సభలలు అని నిరూపించాలి

 మహిళలు అన్ని రంగాలలో రాణించాలి .

 హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు పాల్వాయి రజని కుమారి 
 
హోప్ స్వచ్ఛంద సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నారీశక్తి 2024 పురస్కారాల ప్రధానం

ఆకట్టుకున్న గాయకుల పాటలు, కవితలు, ఉపన్యాసాలు, సన్మానాలు, మెమెంటోలు, సర్టిఫికెట్ల బహుకరణ

సూర్యాపేట:-  ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు తప్పకుండా చదివించాలని విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, మహిళల కోసం  ఓటు హక్కు, ఆస్తి హక్కు, సమాన పనికి సమానం వేతనపు హక్కు, ఎనిమిది గంటల పని దినాల హక్కు, ఉచిత నిర్బంధ విద్యాహక్కు, బాల కార్మికుల నిర్మూలన హక్కు, ప్రసూతి సెలవుల హక్కలను కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన ఆశయాలను కొనసాగించాలని, ఈ ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానులే అని, ఆడ మగ అనే వివక్షతను ఎండగట్టాలని, ఆడవారు అబలలు కాదు సబలలు అని నిరూపించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు పాల్వాయి రజిని కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీరామ్ నగర్ కాలనీ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, నారి శక్తి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి రజనీకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. మహిళలు ఇంటి పనికి, వంట పనికి పరిమితం కాకుండా శాస్త్ర సాంకేతిక విద్య వైద్య వ్యాపార వాణిజ్య సామాజిక సాహిత్య  ఆర్థిక రంగాలలో అగ్రభాగాన ఉండాలని నిలవాలని ఆకాంక్షించారు.  కష్టపడి కాకుండా ఇష్టపడి విద్య ను నేర్చుకొని తాము అనుకున్న లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఎంతోమంది స్త్రీలు గృహంలో కానీ, ఉద్యోగం చేసే చోట  మహిళలు హింసకు, అవమానాలకు, గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అవమానాలు, అవహేళనలను  ధైర్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఉద్యోగాలు చేసి ఆర్థికంగా స్థిరపడినప్పుడే గ్రామం, రాష్ట్రం, దేశం  అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాలలో ఉత్తమ సేవలందించాలని, స్త్రీ పురుషులకు తారతమ్యం లేకుండా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛనివ్వాలని కోరారు. స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదని, మానవజాతి మనుగడనే లేదని వివరించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికపరంగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను ఈ ప్రాంతం నుంచి ఎదిగానని కన్నతల్లిని పుట్టిన ఊరును ప్రతివారు గుర్తుంచుకోవాలని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.  ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి దైద అనిత, మనం వికాస్ వేదిక అధ్యక్షులు, సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్, రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఇరిగి కోటేశ్వరి, కవి, రచయిత హమీద్ ఖాన్, విశ్రాంత ప్రిన్సిపాల్ చందు ఆంజనేయులు, కవి, గాయకురాలు నల్లాన్ చక్రవర్తుల రోజా, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, కవి రచయిత, గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ, సామాజిక కార్యకర్త దుర్గం వెంకటయ్య, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్, కాంగ్రెస్ పార్టీ పదవ వార్డు ఇన్చార్జి చింత జానకి, మాజీ కౌన్సిలర్ సారగండ్ల మాణిక్యమ్మ, జాజిరెడ్డిగూడెం మండల హోప్ అండ్ సింధు ఆర్ట్స్ అకాడమీ కోఆర్డినేటర్ దడిపల్లి వెంకట్, ఆల్ ఇండియా కోర్ కమిటీ సభ్యులు బైరు రమేష్, కారింగుల రమేష్,
 ఐ సి డి ఎస్ సి డి పి ఓ చంద్రిక, ఐసిడిఎస్ సూర్యాపేట మండల సూపర్వైజర్ ఉపేంద్ర, చిలుకూరు మండలం డిప్యూటీ ఎమ్మార్వో నాసిని కరుణ శ్రీ, మోతే  మండల డిప్యూటీ తాసిల్దార్ అమరారపు పద్మజ నాగభూషణం,  కత్తుల శృతి, కత్తుల లలిత, దాచేపల్లి లక్ష్మి, పుట్టల దుర్గ, శీలం జ్యోతి, చైతన్య, శారద, లలిత, మూడు సుజాత, శీలం జ్యోతి, మందపాటి మహేశ్వరి, కడెం అంజమ్మ, స్వీటీ ,సింధు, కళాకారులు చెరుకు శైలేందర్, ఆకారపు ఉపేందర్, పాముల వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు టీచర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బచ్చల కూరి జానయ్య, ఉపాధ్యాయులు నవీలే వెంకన్న, ఇరుగు జానీ, పాల్వాయి బిక్షం, తరాల కిరీటి, మేకల మహేష్, దైద గ్రీష్మన్ మహాజన్, కత్తుల రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాకారులు పాడిన పాటలు, జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ వినిపించిన కవిత వీక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషి  సల్పిన మహిళలకు నారీశక్తి పురస్కారాలు 2024 తో పాటు శాలువాలతో సన్మానించి, సర్టిఫికెట్లు బహూకరించి, మేమెంటోలు అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333