మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!

మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులను ప్రతిఘటిద్దాం.  

Mar 8, 2024 - 19:42
 0  6
మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!

 - వల్లమళ్ల భద్రమ్మ పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యులు.

అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాటం దినం స్ఫూర్తితో దేశంలో మోడీ అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులను ప్రతిఘటించాలని ప్రగతిశీల మహిళా సంఘం(POW) జిల్లా కమిటీ సభ్యులు భద్రమ్మ పిలుపునిచ్చారు.ఈ రోజు నాగారం మండలం పసునూరు గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యులు వల్లమళ్ళ భాద్రమ్మ మాట్లాడుతు మహిళ హక్కుల కోసం అంతర్జాతీయ శ్రామిక మహిళ హక్కుల పోరాట దినంను స్ఫూర్తిగా తీసుకొని  శ్రామిక మహిళలందరూ పోరాటాలకు సిద్ధపడాలని కోరారు.నేడు సమాజంలో అన్ని వర్గాల స్త్రీల పట్ల ఇంట బయట తీవ్ర వివక్షత,పురుష దురహంకార దాడులు కొనసాగుతూ పురుషాధిపత్యం రాజ్య మేలుతున్నది అని అన్నారు. భారతదేశంతో సహా అన్ని దేశాలలో మతాలకు అతీతంగా ఇంటి లోపల, ఇంటి బయట,ఫ్యాక్టరీలలో, ఆఫీసులో, రైళ్లలో,బస్సులలో, రోడ్డు పైన స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా పెట్టుబడిదారి వ్యవస్థ సమాజం పరిగణిస్తున్నదని ఆమె అన్నారు. దేశంలో పేద,దళిత,ఆదివాసి, మైనార్టీ స్త్రీలపై దోపిడీ, అణిచివేత, లైంగిక ,దాడులు , వరకట్న దురాచారాలు, ప్రేమ పేరుతో జరిగే దాడులు ,దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయాన్నారు.అన్నీ రకాల హింసలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీ అణిచివేతల మూలాలు వ్యక్తిగత ఆస్తి మరియు పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడడం లోనే ఉన్నాయని, సనాతన ధర్మం పేరుతో మళ్ళీ వంచనకు గురించేస్తున్నారు అన్నారు. మహిళాలను మరింత అణిచివేతకు, దోపిడీకి గురించేయ్యడానికి మతోన్మాధులు  కుట్రచేస్తురన్నారు అన్నారు.అందుకే స్త్రీ హక్కుల ఉద్యమం పితృస్వామ్యం రద్దు మరియు వ్యక్తిగత ఆస్తి రద్దు అనే జంట లక్ష్యాలను కలిగి ఉండి ఉద్యమాలను నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు భద్రతకై సమానత్వం కై మనువాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూన్న కార్మిక ,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పోరాడాలని పిఓడబ్ల్యు పిలుపునిస్తోందని అన్నారు. మహిళలు హక్కుల కోసం పోరాటం చేయడం తప్ప మరోమార్గం లేదన్నారు.కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా నాయకులు నల్లగట్టు సుగుణమ్మ, యాకూబి, వేర్పుల స్వరూప,గంగాభవాని,పద్మ,ఉమ, రామతర,అవిలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333