ఆడపిల్ల_పుట్టుక_పోరాటం,
ఆడపిల్ల_పుట్టుక_పోరాటం,
బతుకు పోరాటం,
అసలు వాళ్ళ జీవితమే పోరాటం...
ఎన్నో ఎదుర్కోవాలి ఎన్నిటితోనో పోరాడాలి...
అందులో వాళ్ళ ప్రమేయంలేని పోరాటాలు చాలా ఉంటాయి...
ప్రతినెల తనలో జరిగే కదనాలు
ప్రతినిత్యం సమాజం చెప్పుకునే కథనాలు...
ప్రాణం పోసే శక్తున్న వాళ్ళకి
ప్రాణం తీసే నొప్పిని తట్టుకునే శక్తి కూడా ఉంది...
అందుకే.. మానవ సృష్టికి మూలం అయి
మన జీవితం ఆరంభం నుండి అంతం వరకు
అనుక్షణం మన జీవితంలో భాగమై మన కష్టాల్లో
సుఖాలలో అడుగడుగునా తోడుండే
మహిళను ఈ ఒక్కరోజు కాకుండా ప్రతి రోజు
స్వేచ్ఛ సమానత్వం తో గౌరవిద్దాం
అవే వారికీ నిత్య ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
డాక్టర్ బంటు కృష్ణ, గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత