79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-225 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలలో 79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరిపారు. చిన్నంబావి మండలం గూడెం గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర సెక్రెటరీ విక్రమ్ యాదవ్ మిఠాయి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడి కేంద్రం దగ్గర టీచర్ పార్వతమ్మ జెండా ఎగురవేసి జెండా దగ్గరికి వచ్చిన గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. తదనంతరం గ్రామస్తులైన ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీజీ చిన్నారులపై మక్కువతో చిన్నారులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఎండీ ఖలీల్ భాషా చిన్నారులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. శివ సాగర్ చిన్నారులకు సిరి చాపలను పంపిణీ చేశారు.
గూడెం గ్రామ ప్రాథమిక పాఠశాల దగ్గర హెడ్మాస్టర్ నరేష్ జండా ఎగరవేసి గ్రామస్తులకు మిఠాయి పంపిణీ చేశారు. తదన అనంతరం చిన్నారులు ఆటపాటలతోటి గ్రామస్తులును ఆకట్టుకున్నారు. తదన అనంతరం వేదికపై గ్రామస్తులు మాజీ సర్పంచ్ మమిలపల్లి చక్రవర్తి, సెక్రెటరీ విక్రమ్ యాదవ్, ఆది, ఎండి మక్బుల్ పాషా, సుధాకర్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ముద్దు ప్రవేట్ పాఠశాలలు వద్దు అనే నినాదంతో చిన్నారులకు అనేక కొత్త విషయాలను చెప్పారు. స్కూల్ కి వెళ్లడానికి రోడ్డు, స్కూల్లో విద్యుత్, పరికరాల గురించి మాట్లాడుతూ త్వరలోనే మేము సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలోనే సమస్యలను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు స్కూల్ పై ఉన్న ప్రేమతో మోసమునేని రవి, క్యాథూరి చంద్రశేఖర్, సూర్యవంశం శివ, కానిస్టేబుల్ రాజశేఖర్ విద్యార్థులకు టాయ్ బెల్టు, ఐడి కార్డులను తయారుచేసుకొచ్చి పంపిణీ చేశారు. అదేవిధంగా కొత్త కళ్యాణ్ రామ్, సుధాకర్ నాయుడు పార్టీ తరఫున తరపున ప్రాజెక్ట్ ని డొనేషన్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మోజి దంపతులు చిన్నారులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు డొనేషన్ చేశారు. గూడెం గ్రామంలో జిపిఎల్ మొదటి బహుమతి పొందిన టీం స్కూలుకి ప్రింటర్ డొనేషన్ చేశారు. శివసాగర్ గ్రామంలో నుంచి స్కూల్ కి వెళ్లడానికి రహదారి బాగు లేనందువలన ఒక వెహికల్ ని ఏర్పాటు చేసి ఆ వెహికల్ కి ప్రతి నెల 5000 రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. ఎండి మక్బుల్ పాషా కంప్యూటర్ ని డొనేషన్ చేశారు. బిక్కిం జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో పూర్వ విద్యార్థులు2004-2005 పదవ తరగతి విద్యార్థులు స్కూల్ పైన మమకారంతో బెంచీలను కుర్చీలను డొనేషన్ చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిల్లపల్లి చక్రవర్తి, క్యాథరి రాముడు, రవీందర్ రెడ్డి, కుమ్మరి బుచ్చన్న, బత్తుల నారాయణ, బాలేశ్వరయ్య, సుధాకర్ నాయుడు, సెక్రెటరీ విక్రమ్ యాదవ్, ఎండి మక్బూల్ బాషా, తెలంగాణ వార్త జర్నలిస్ట్ విష్ణు సాగర్, మార్గం శ్రీశైలం, గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.