ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా పరిషత్ కార్యనిర్వర్ణ అధికారి శోభరాణి
అడ్డగూడూరు 06 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభరాణి మండల పరిషత్ అడ్డగూడూరు కార్యాలయమును సందర్శించి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులతో వేరువేరు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి,స్టోర్ రూమ్ ను పరిశీలించి,తదుపరి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి,వారి యొక్క విద్య అభ్యసన ప్రగతి తీరును పరిశీలించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత పంచాయతీరాజ్,గ్రామీణ నీటిపారుదల,హౌసింగ్.ఏఈలు,మండల కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.