సెప్టెంబర్ 17ని విలీన దినోత్సవంగా నిర్వహించాలి -సిపిఐ.
నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింలు కలసి నిర్వహించారు .
జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల. జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యాలయం గద్వాలలో గోపాల్ రావు అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, నడిగడ్డ ఉద్యమ నాయకులు నాగర్ దొడ్డివెంకట్రములు, అతికూర్ రహిమాన్, రైతంగా సమితి నాయకులు గోపాల్ యాదవ్ లెక్షరర్ పరేష్ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు రెండు నిమిషాలు నివాళులర్పించారు.ఈ సందర్భంగా నైజాం నవాబును తరిమి కొట్టిన కమ్యూనిస్టులను,సాయుధ రైతాంగ ప్రజా పోరాటాలను కనుమరుగు చేయీలనుకోవడం ఎవ్వరి తరం కాదు అన్నారు, కమ్యూనిస్టులు చేసిన వీరోచిత పోరాటాల వల్లనే నరహంతక నైజాం నవాబును వారి తాబేదారులను తురిమి కొట్టడం జరిగిందని తద్వారా నిజాం నవాబు కేంధ్ర ప్రభుత్వానికి లొంగిపోయారు తప్ప మరెవరి పాత్ర లేదన్నారు, సెప్టెంబర 17వ, తేదీని అధికారికంగా నిర్వహిండం ఆహ్వానిస్తున్నాము కానీ ప్రజాపాలన అనే పేరు పెట్టడమే సరైన విధానం కాదు అన్నారు .విలీన దినోత్సవం పేరుతోని నిర్వహించి నాటి పోరాట యోధులను స్మరించుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీలను ఆనాయకులను కూడా ఆహ్వనించాల్సి ఉండే అన్నారు .నాటి పోరాటం లో ఏ మాత్రం పాత్ర లేని బిజేపి పార్టీ ఈ కార్యక్రమాన్ని హైజాక్ చేసి కమ్యూనిస్ట్ పోరాటాలను భావితరాలకు తెలువ కుండా చేయడానికి ప్రయత్నించడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం అనాడు మఖ్దూమ్, రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి తదితరుల నాయకత్వంలో హిందువులు ముస్లిం లు కలసి పోరాడారన్నారు.నిజాం రాజ్య అరాచక ఆగడాలను వెట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా కమ్యునిస్టు పార్టీ నాయకత్వాన జరిగిన పోరులో 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారన్నారు, 10వేల గ్రామాలను విముక్తి చేయడం జరిగింది తెలిపారు, నిజాం సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన పొరులో నాలుగున్నర వేల కమ్యూనిస్టు వీర యోధులు వీరమరణం పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ జిల్లా సభ్యులు అశన్న , కాశీం,aisf జిల్లా కార్యదర్శి ప్రవీణ్, రైల్వే పాషా, రైతు సంఘం నాయకులు హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు మస్తాన్, ధర్మన్న తిమ్మప్ప వెంకటేశు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.