రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి-సీపీఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్

Sep 3, 2025 - 18:54
 0  7
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి-సీపీఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి-సీపీఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్

స్పందించిన బ్యాంక్ చైర్మన్ తొందర్లో అందరికి యూరియా అందిస్తాం అన్ని హామీ..
అడ్డగూడూరు 03 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగుడూరు మండల కేంద్రంలో ఉన్న సహకార బ్యాంకులో రైతులు గత రెండు రోజులుగా యూరియా కోసం బారులు తీయడం జరిగింది అక్కడ నుంచి వెళ్తున్న సీపీఎం నాయకులు రైతులతో మాట్లాడటం జరిగింది.


    ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో రైతులకు యూరియా కొరత  ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆందోళన గురైతున్న  పరిస్థితి కనపడతా ఉంది. మేము కూడా సిపిఎం పార్టీగా అన్ని  మండల కేంద్రాలను సందర్శించి అన్ని సహకార బ్యాంకులలోకి పోయి రైతులు పడుతున్నటువంటి సమస్యలను స్వయంగా తెలుసుకుని అక్కడున్నటువంటి పిఎసిఎస్ చైర్మన్ లతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అడ్డగుడూరు  మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎసిఎస్ చైర్మన్ నిరంజన్ రెడ్డితో మాట్లాడుతున్న క్రమంలో సానుకూలంగా స్పందించిన చైర్మన్ వీలైనంత తొందరలో రైతులకు కావాల్సినంత యూరియా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ మాత్రం ఎక్కడ కూడా రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందిస్తామని చెప్పలేనటువంటి పరిస్థితి కనపడుతుంది.సమస్య వచ్చినప్పుడు మాత్రమే జాగ్రత్త పడటం కాకుండా రైతుల విషయాలను ముందస్తుగానే అంచనా వేసి రైతులకు కావాల్సినటువంటి యూరియా గానీ ఇతర మందులను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సాధ్యమైనంత తొందరలో సరిపడా యూరియా అందించాలని కూడా సిపిఎం పార్టీగా కోరుతున్నాము..లేని పక్షంలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిని సమీకరించి వేలాది మందితో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,గుండు వెంకట నర్సు,సిపిఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్,లక్ష్మీనరసింహస్వామి,వళ్ళంబట్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333