అయిజ పట్టణంలో గుంత పూడ్చిన R&B రోడ్డు & పోలీస్ శాఖ అధికారులు

జోగులాంబ గద్వాల ఐదు అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ రహదారుల మరమ్మతులు సాధారణంగా ప్రజాపనుల శాఖ (R&B) పరిధిలోకి వస్తాయి. అయితే కర్నూల్–రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై అయిజ పట్టణ సమీపంలోని పెద్దవాగు వంతెనపై పెద్ద గుంత ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీనిని గమనించిన స్థానిక పోలీసులు & R&B రోడ్డు అధికారులు ఆదివారం ముందుకొచ్చి గుంత పూడ్చే పనులు చేపట్టారు.స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, గుంత పూడ్చేందుకు కావలసిన మట్టి, సిమెంట్ వంటి పదార్థాలను సమకూర్చారు. తద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రదేశంలో సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఇలాంటి గుంతలు తరచుగా ఏర్పడుతుండడంతో ప్రతీసారి పోలీసులు స్వయంగా వాటిని పూడ్చడం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఈ మరమ్మతులు చేయాల్సిన బాధ్యత R&B అధికారులదైనా, ప్రజల భద్రత కోసం పోలీసులు మానవత్వంతో ముందుకు రావడం ప్రశంసనీయంగా మారింది.ప్రజల భద్రతకే ప్రాధాన్యం – సేవలో ముందంజలో అయిజ పోలీసులు, వాహనదారులు అధికారులను అభినందించారు.