ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోనిసత్యసాయి విద్యా మందిరంలో కర్నూల్ నేత్ర వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్య సాయి విద్యా మందిర్ కన్వీనర్ చిగుళ్లపల్లి సాయి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో సుమారు 200 మంది పాల్గొనగా అవసరమైన వారికి కళ్లద్దాలు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.