జిల్లా వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన మండలాల ఏఈఓలు

జోగులాంబ గద్వాల్ 27 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాల వ్యవసాయ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టే బోయే డిజిటల్ క్రాప్ సర్వే గురించి పక్కా రాష్ట్రాలలో ప్రతి 1000 ఎకరాలకు ఒక అధికారి నీ నియమించి సర్వే చేయిస్తే మన రాష్ట్రము లో మాత్రం 6000 నుండి 10000 వేల ఎకరాలకు ఒక ఏఈఓ ద్వారా ఈ సర్వే చేయించడం తీవ్ర అన్యాయం అని అన్నీ మండలాల ఏఈఓ లు జిల్లా వ్యవసాయ అధికారి అయినటువంటి సక్రియ నాయక్ కు శుక్రవారం తన కార్యాలయం లో ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య ను పరిష్కారం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారినీ ఏఈఓ లు కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఏఈఓల సంఘం అధ్యక్షులు లోకరాజు తో పాటు ఇతర ఏఈఓ లు అనిల్, రవీందర్, మణిప్రకాష్, జెన్నీఫర్, శిల్ప, హసీనా, రవి, భాస్కర్ లు మరియు ఇతరులు పాల్గొన్నారు.