ట్రాక్టర్ ఢీ:నాలుగేళ్ళ బాలుడు మృతి

Jun 12, 2025 - 22:11
 0  5
ట్రాక్టర్ ఢీ:నాలుగేళ్ళ బాలుడు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ట్రాక్టర్ ఢీ:నాలుగేళ్ళ బాలుడు మృతి. మండలంలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద బంధువుల శుభ కార్యానికి కట్టంగూర్ మండలం తెలువారీ గూడెంకు చెందిన గట్టిగొర్ల మహేష్, శ్రావణి దంపతులు గురువారం వచ్చారు. వీరి కొడుకు మోక్షిత్ (4) గుడి వద్ద రోడ్డు దాటుతుండగా సూర్యాపేట వైపు నుంచి నెమ్మికల్కు వస్తున్న నెమ్మికల్ కే చెందిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. చిన్నారి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.