గొట్టుముక్కుల పద్మారావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణ వార్త, ఏప్రిల్ 08 : మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి సభ్యులు, పట్నం మహేందర్ రెడ్డి సోమవారం ఉదయం సీనియర్ రాజకీయ నాయకులు గొట్టుముక్కుల పద్మారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా పద్మారావును ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి గొట్టుముక్కుల పద్మారావు సానుకూలంగా స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ భేటీలో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, జరుగుతున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పిశెట్టి దినేష్, మేకల మైఖేల్, మహిళా నాయకురాలు దుర్గారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.