అనాధలైన విద్యార్థులు చదువుకుంటూ నానమ్మను పోషించుకుంటూ

విధి ఆడిన వింత నాటకంలో ఓ నిరుపేద కుటుంబం వీధిన పడింది
తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
చదువుకుంటూ నానమ్మను పోషించుకుంటూ...
కురుస్తున్న రేకుల ఇల్లు
బిక్కుబిక్కుమంటున్న ఆడపిల్లలు
అయ్యా కలెక్టర్ గారు ఆదుకోండి...
నూతనకల్ 24 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్;
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం వీధిన పడింది గత ఆరు సంవత్సరాల క్రితం గుండాల సరిత తల్లి, అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది ఆ తర్వాత తండ్రి లింగయ్య కూలినాలి పనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లల్ని చదివించుకుంటూ కన్న తల్లిని పోషించుకునేవాడు దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరం క్రితం తండ్రి మరణించడంతో పిల్లలు అనాధలయ్యారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఆడపిల్లలు లిఖిత(14) నికిత(15) నూతనకల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తున్నారు సెలవు రోజుల్లో కూలి నాలు పనులు చేసుకుంటూ వృద్ధురాలైన తన నానమ్మ ఐలమ్మను పోషించుకుంటున్నారు కనీసం ఉండటానికి ఇల్లు లేదు ఇంట్లో నిత్యవసర సరుకులు లేవు దయని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నా అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాలాడుతున్నారు....