భక్తిశ్రద్ధలతో గణనాథుని వినూత్న ప్రదర్శన

Aug 26, 2025 - 19:46
 0  27

 జోగులాంబ గద్వాల 26వ ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఎర్రవల్లి  శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( CBSE ) స్కూల్ నందు వినూత్నంగా బొజ్జ గణపయ్యను ప్రదర్శించిన విద్యార్థులు.

ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE స్కూల్ నందు విద్యార్థులు కొత్త ఆలోచనలతో బుజ్జి గణపయ్యను విద్యార్థులందరూ గణపయ్య ఆకారంలో కూర్చుని అబ్బురపరిచారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయులు అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ అని పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితి జరుపుకుంటారని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలియపరిచారు. ఇట్టి బుజ్జి గణపయ్యను చూసిన పాఠశాల చైర్మన్ ఆనందం వ్యక్తం చేసి విద్యార్థులందరినీ అభినందించారు అదేవిధంగా చిన్నారులు మట్టి వినాయకుని చేసి పర్యావరణాన్ని కాపాడాలి పరిరక్షించుకోవాలి మనమందరం బాగుండాలనే ఉద్దేశంతో చిన్నారులు చేసిన చిన్నచిన్న గణనాథులను చూసి మురిసిపోయారు వీరికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలియపరచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. 

      ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ నందిని కేని, వైస్ ప్రిన్సిపాల్ మహిమ శ్రీ, అధ్యాపక బృందం సువర్ణ, రేణుక, రుక్సానా, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రియాంక, లాలు, నరేంద్ర మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333