వచ్చే నెల నుండి అమల్లోకి వచ్చే కొత్త చట్టాలు:ఎస్పీ టి. శ్రీనివాస రావు

Jun 29, 2024 - 18:45
 0  3
వచ్చే నెల నుండి అమల్లోకి వచ్చే కొత్త చట్టాలు:ఎస్పీ టి. శ్రీనివాస రావు

గద్వాల్:-వచ్చే నెల నుండి అమల్లోకి వచ్చే కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే క్రమం లో స్టేషన్ ల ఎస్హెచ్ఓ లు,స్టేషన్ రిటర్  లు,సీసీటీఎన్ స్ రైటర్స్ కొత్త చట్టాల ఎస్ఓపి నీ అనుసరించి కేసులు నమోదు చెయ్యడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, సాక్ష్యాలను సేకరించి కోర్టు లలో చార్జీ షీట్ వేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ,స్టేషన్ రైటర్స్ ను ఆదేశించారు.జిల్లా లోని ఆయా పోలీస్ స్టేషన్ ల ఉన్న ఎస్సై లకు, ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో పని చేస్తున్న రైటర్స్ కు,సీసీటీఎన్ స్ రైటర్స్ కు డి. ఎస్పీ సత్య నారాయణ ఆద్వర్యంలో నూతన చట్టాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేకరించాల్సి సాక్ష్యాలు తదితర అంశాల గురించి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరై ఎస్సై లకు,స్టేషన్ రైటర్స్ కు, సీసీటీఎన్స్ రైటర్స్ కు జులై 1 వ తేది కొత్త చట్టాలను అనుసరించి కేసులు నమోదు చెయడం, సాక్ష్యాలను సేకరించడం, కోర్టు లలో చార్జీ షీట్ వేసే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై పలు సూచనలు చేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జులై 1st నుండి కొత్త చట్టాలను అనుసరించి కేసులు నమోదు చెయ్యాలని, కొత్త చట్టాల ఎస్ ఓ పి  నీ అనుసరించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టు లలో చార్జీ షీట్ వేయడం ద్వారా నేరస్థులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలని అధికారులకు, రైటర్స్ కు సూచించారు. 
కొత్త చట్టాలను అనుసరించి ఆయా సెక్షన్ ల ద్వారా కేసులు నమోదు చేసే క్రమం లో, సాక్ష్యాధారాలను సేకరించే క్రమంలో ఏలాంటి సందేశాలను  ఉన్నతాధికారులను ఫోన్ లో సంప్రదించి వారి సలహాలు,సూచనలు తీసుకోవాలని ఆదేశించారు.పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి, విచారణ చేపట్టి కోర్టు లోచార్జీ షీట్ సబ్మిట్ చెయడం ద్వారనే నేరస్థులకు శిక్షలు పడే శాతాన్ని పెంచవచ్చు ఆని ఆ దిశగా కృషి చేయలని అధికారులను  ఆదేశించారు. అలాగే ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో సుమ్మన్స్ ను ప్రాపర్ గా సర్వ్ చెయ్యాలని, ఎన్ బి డబ్ల్యూ ఎస్ వారెంట్స్ సర్వ్ చెయ్యాలని, ఎప్పటికప్పుడు ఆయా కేసులకు సంబంధించిన సీసీ (కోర్టు కేలండర్) నంబర్స్ పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గద్వాల్, శాంతి నగర్ సీఐ లు భీమ్ కుమార్, రత్నం, ఎస్బి ఇన్స్పెక్టర్ జంములప్ప, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై, వివిధ విభాగాల ఎస్సై లు అన్ని పోలీస్ స్టేషన్ ల రైటర్స్ మరియు సీసీటీఎన్ స్ రైటర్స్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333