చెన్నైలో డాక్టరేట్ తీసుకుంటున్న భాస్పంగు భాస్కర్

Aug 24, 2025 - 07:24
 0  7
చెన్నైలో డాక్టరేట్ తీసుకుంటున్న భాస్పంగు భాస్కర్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ డాక్టరేట్ పొందిన సామాజికవేత్త శ్రీ భాషపంగు భాస్కర్* చెన్నై గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సత్కారం.. ఆత్మకూర్ ఎస్. సమాజ సేవకు అంకితమైన వ్యక్తిత్వం, రాష్ట్ర దళిత రత్న అవార్డు గ్రహీత బోప్పారం గ్రామానికి చెందిన భాషపంగు భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది.శనివారం చెన్నైలోని ప్రతిష్టాత్మక భారతీయ విద్యా భవన్ లో, గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ సత్కారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్లోబెల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ఎం.డి. అరీఫుడ్ఫిన్ భాస్కర్ కు ఈ అరుదైన అవార్డును ప్రదానం చేశారు. వివిధ రంగాలలో తమ విశేష కృషి, నైపుణ్యంతో సమాజానికి సేవ చేసిన సుమారు 150 మంది ప్రముఖులకు దేశవ్యాప్తంగా ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాస్కర్ కి ఈ గౌరవం లభించడం ఆయన అంకితభావాన్ని, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తించడమేనన్నారు. ఇది సమాజానికి, ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన నిరంతర కృషికి నిలువుటద్దంఅని కొనియాడారు. ఈ కార్యక్రమం గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు పి మాన్యువల్, న్యాయమూర్తి వెంకటేశన్, తవతీరు స్వామి పద్మేంద్ర, ఐ ఏ ఎస్ అధికారి సంపద్ కుమార్,నాగనాథన్, సిరిల్ సూడవెల్లి, అనిత కుప్పుస్వామి, తాంగరాజు, జయ మహేశ్, వలర్మతి, రాజకుమార్ , డాక్టర్ సుకుమార, తదితరులు పాల్గొన్నారు.