టీచర్ ని వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టిన విద్యార్థులు

Aug 27, 2025 - 21:31
 0  5
టీచర్ ని వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టిన విద్యార్థులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మా టీచర్ మాకే ఉండాలని అడ్డం పడ్డ విద్యార్థులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆత్మకూర్ ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పి వనజ గత ఏడు సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తూ నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణతో విద్యార్థులను వృద్ధిలోకి తీసుకొచ్చింది. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ పదోన్నతి ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామవరం మోతే మండలం కు విధుల నుండి విడుదలైన సందర్భంగా మండల విద్యాధికారి శ్రీ ధారా సింగ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వి శ్రవణ్ కుమార్ మండల ఉపాధ్యాయులు వనజ మేడంను అభినందించారు. వనజ మేడం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కోచింగ్ ద్వారా విద్యార్థులను తీర్చి దిద్దడం మర్చిపోలేనిదని అభిప్రాయపడ్డారు. ఈ విధుల నుండి విడుదలైతున్న సందర్భంలో గ్రామస్తులు తెలుసుకొని వనజ మేడం సేవల్ని గుర్తు చేసుకుంటూ మేడం ఇక్కడే ఉండాలని మా పిల్లల కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని అన్నారు విద్యార్థినీ విద్యార్థులు వనజ మేడం చేసిన కృషిని ప్రశంసిస్తూ క్రమశిక్షణ తో విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. విద్యార్థులు మా మేడం మాకే ఉండాలని కన్నీళ్ల పర్యంతమైనారు. విద్యార్థులు మేడం చుట్టుముట్టి వెళ్ళొద్దని ప్రాథమిక పడుతూ ఏడవడం అందరిని దుఃఖ సముద్రంలో ముంచింది మేడం పిల్లలతో పెనవిసుకున్న బంధాన్ని దుఃఖాన్ని ఆపడం అక్కడున్న ఉపాధ్యాయులకు సాధ్యం కాలేదు. ఇటీవల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధి పట్ల ప్రధానోపాధ్యాయురాలు వనజ కృషిని కలెక్టర్ గారు ప్రశంసించిన విషయం తెలిసిందే.