భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Aug 27, 2025 - 18:05
Aug 27, 2025 - 18:50
 0  7
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్;28 ఆగస్టు 2025 గురువారం తెలంగాణ వార్త రిపోర్టర్: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏడవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు చండూర్ మండల బి.వి.హెచ్ పి.స్ అధ్యక్షులు ఆకారపు వెంకన్న సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ..నిరంతరం వికలాంగుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తరపున ఏడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క ఆవిర్భవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కు, రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తదనంతరం అందరి సమక్షంలో కేక్ కత్తిరించి ఒకరికొకరు తినిపించుకుంటూ ఆవిర్భావం సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.