అడ్డగూడూరు డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో సి.పి.ఆర్.పై అవగాహన సదస్సు

Oct 15, 2025 - 00:45
Oct 15, 2025 - 00:46
 0  7
అడ్డగూడూరు డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో సి.పి.ఆర్.పై అవగాహన సదస్సు

అడ్డగూడూరు 14 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సి పి ఆర్ ఫై అవగాహన సదస్సు డాక్టర్ వి భార్గవి ఆధ్వర్యంలో సి.పి.ఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సి పి ఆర్ పై అవగాహన కలిగి ఉండాలని మోత్కూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్" హేమంత్ ముఖ్య అతిథిగా పాల్గొని అందరూ వివిధ సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితి పై అవగాహన ఉండాలని అన్నారు.మండల కేంద్రంలోని మంగళవారం రోజు రైతు వేదికలో సిపిఆర్ వార్షికోత్సవాలు కార్యక్రమం భాగంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, ఎంపీఓ ప్రేమలత,పోలీస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, వివిధ గ్రామాల అంగన్వాడీలు,ఆశ కార్యకర్తలు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.