పాఠశాలల పరిశీలన బృందాల ఏర్పాటు విరమించుకోవాలి. డిటిఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ

Oct 15, 2025 - 06:32
 0  0

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ *పాఠశాలల పరిశీలన బృందాల ఏర్పాటు విరమించుకోవాలి. డిటిఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ* తేదీ 14 10 2025 సూర్యాపేట రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల తనిఖీల కొరకు తనిఖీ బృందాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని వీరి స్థానంలో ఎంఈఓ లను డిప్యూటీ ఇఓ ,డిఇఓ లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని డిటిఎఫ్ సూర్యపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కొచ్చర్ల వేణు డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో పనిని మెరుగుపరచడానికి ఉపాధ్యాయాలని తరగతి గదులకు పరిమితం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పాఠశాలలకు తనిఖీ బృందాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 168 బృందాలను ఏర్పాటు చేయటం ద్వారా 1473 మంది ఉపాధ్యాయులని బడికి దూరం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం శోచనీయమని వారు అన్నారు. ఇప్పటికే పరిశీలన అధికారులు మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు శాశ్వత ప్రాతిపదికన నియామించకపోవడం మూలంగా పాఠశాలల పరిశీలన రోజుకు తగ్గిపోతూ ఉన్నది.పరిశీలనా అధికారులను శాశ్వత ప్రాతిపదిక నియమించాల్సిన స్థితిలో పాఠశాల పరిశీలన బృందాల పేరుతో పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా బోధన చేసేటువంటి ఉపాధ్యాయులకు కొరత ఏర్పడి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందే పరిస్థితి లేదు. ఈ బృందాలలో కూడా పైరవీకారులకి, అధికారులకి అనుకూలంగా ఉండే ఉపాధ్యాయులకు అవకాశాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ తనిఖీ బృందాల్లో పనిచేయడానికి వెళుతున్నటువంటి వారి స్థానాల్లో మరి కొంతమందిని డిప్యూటేషన్ మీద పంపడం ఇదంతా పాఠశా లలను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ మీద ఎన్జీవోల యొక్క పెత్తనాన్ని చూస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక ట్రైనింగ్ పేరుతో ఉపాధ్యాయుని బడికి దూరం చేస్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్లతో, కాంపిటీషన్స్ తో, డాన్స్ ప్రోగ్రామ్లతో ర్యాలీలతో పాఠశాలలో నడిచే పరిస్థితి కనబడటం లేదు ఈ పరిస్థితుల్లో తనిఖీ బృందాలను నియమించే కార్యక్రమాన్ని వెంటనే ఆపాలని వారు కోరారు