మళ్లీ వర్షాలు వచ్చేశాయోచ్..! తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

Aug 5, 2025 - 18:58
 0  0
మళ్లీ వర్షాలు వచ్చేశాయోచ్..! తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.

ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు.

ఇవాళ మంగళవారం(ఆగస్టు 05) కూడా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.. అయితే, కొన్నిచోట్ల అది ఆరెంజ్‌ అలర్ట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఈ రోజు తెలంగాణ లోని మేడ్చల్ మల్కాజిగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333