హైడ్రా తో రియల్ ఎస్టేట్ రంగం కూదెలు

Sep 25, 2024 - 20:46
Sep 25, 2024 - 22:53
 0  83
హైడ్రా తో రియల్ ఎస్టేట్ రంగం కూదెలు

హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు.

రిజిస్ట్రేషన్ నిర్మాణాలకు మినహాయింపు ఇవ్వాలి.

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 25:- తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చెరువులకు సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ భూములకు హైడ్రా వల్ల ధరలు తగ్గాయని అన్నారు. ప్రభుత్వం నిజంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చాలి కానీ గత 50 ఏళ్లుగా పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చడం సరికాదన్నారు.చెరువు కట్ట నుండి 30 మీటర్ల దూరం తర్వాతనే నిర్మించుకున్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ తో పాటు ఇంటి పన్ను, పర్మిషన్ టాక్సులు కట్టుకున్నారని తెలిపారు. ఎఫ్ టి ఎల్ కు , బఫర్ జోన్ కు 30 మీటర్ల దూరం మాత్రమే నిబంధనలు ఉన్నప్పటికీ 200 మీటర్ల మేరకు అధికారులు మార్కింగ్ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. గత 50 సంవత్సరాల నుండి ప్రభుత్వ అనుమతులతో ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వానికి ఇంటి పన్ను, కరెంటు బిల్లులు కడుతున్న వారు తమ ఇండ్లను కూల్చివేస్తే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు.

 ప్రభుత్వం హైడ్రాను తెచ్చి బడా నాయకులకు నోటీసులు ఇచ్చి, టైం ఇచ్చి కాలయాపన చేస్తూ వారిని కాపాడుతూ పేదల ఇళ్ళను మాత్రం గంట కూడా సమయం ఇవ్వకుండా కూల్చడం దుర్మార్గమన్నారు. చెరువులను, నాలాలను కబ్జాలు చేసిన వాటిని కూల్చివేయాలి తప్ప పేదల నిర్మించుకున్న ఇండ్లను కూల్చోద్దని ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. పేదలు బ్యాంకు లోన్ లు తనాక రిజిస్ట్రేషన్లు చేసుకొని అప్పులు తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్న వారు తమ ఇండ్లను కూల్చివేస్తే వారంతా రోడ్డున పడడమే కాక ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. నాడు అధికారులు చేసిన నిర్లక్ష్యానికి నేడు పేదలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మండాది గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న పట్టణ ఉపాధ్యక్షుడు అయితగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ గిరీశం సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223