హైడ్రా తరహా చర్యలు ఉంటాయా...?
కబ్జాల కోరల్లో బక్క చిక్కిన చెరువులు ఎన్నో...?
నామరూపాలు లేకుండా పోయిన ఎన్ఎస్పి కాలువలు..?
ఖమ్మం రూరల్ మండలంలో
రియల్ ఎస్టేట్ వెంచర్లకు"కనుమరుగైన"ఎన్ఎస్పి కాలువలు...?
ప్రతి వేసవిలో నీటిపారుదల శాఖ రెవిన్యూ అంతా హడావుడే...? ఇంతకీ చర్యలేవి..?
దేవాలయ భూములు సైతం వదలని కబ్జా రాయుళ్లు...?
ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు కబ్జాల కోరల్లో చిక్కిన విలువైన ప్రభుత్వ భూములు...?
తెలంగాణ వార్త ప్రత్యేక కథనం...!
పాలేరు ప్రతినిధి.ఆగస్టు 18 ఆదివారం:- పాలేరు నియోజకవర్గంలో చెరువులు దేవాలయ భూములు ఎన్ఎస్పి కాలువలు ఆర్ అండ్ బి రోడ్లు ప్రభుత్వ కార్యాలయాలు సైతం కబ్జాల కోరల్లో చిక్కుకొని బక్క చిక్కిపోయిన ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయని సామాజిక కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్న వైనం. ప్రతి ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు కుంటలు దేవాలయాల భూములు కబ్జాల కోరల్లో చిక్కుకొని విస్తీర్ణాన్ని కోల్పోతున్న కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కబ్జాల రాయుల్లు కబ్జాలు చేస్తూ దండిగా దండుకొని వైభోగం వెలగబెడుతున్న గాని సంబంధిత నీటిపారుదల రెవిన్యూ యంత్రాంగాలు పూర్తిగా విఫలమయ్యాయ అనే ఆరోపణలు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు పెద్దతండా శ్రీరాంనగర్ త్రీ తదితరచోట్ల ఎన్ఎస్పి కాలువలు సైతం కబ్జాలకు గురై ఒక్కొక్క చోట పూర్తిగా నామరూపాలు లేకుండా పోయినా గాని పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన పత్రికల్లో వార్తా కథనాలు వెలుగులోకి వచ్చినప్పుడు కంటి తూడుపుచర్యగా హడావుడి చేసి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని రైతులు ప్రజలు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి మండలంలో కూడా ఎన్ఎస్పి కాలువలు సైతం కబ్జాలకు గురై ప్రతి ఏడాది ఖరీప్ రబీ సీజన్లో పంట కాలువల పంచాయతీలు ప్రతి ఏడాది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయని రైతులు ఆరోపిస్తున్నారు. కబ్జారాయుల్లకు అర్ధబలంతో పాటు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తిన గాని సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారని పలువురు ఫిర్యాదారులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి మండల పరిధిలోని నేలకొండపల్లి ప్రముఖ దేవాలయాలకు చెందిన భూములు సైతం మండల పరిధిలోని పెద్ద తండా వద్ద కబ్జాలకు గురై దర్జాగా సాగు చేస్తున్న గాని సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని పలువురు రైతులు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. నేలకొండపల్లి మండలంలో ప్రధానంగా చెరువు మాదారం చెరువు గత ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు ప్రతి ఏడాది కబ్జాలకు గురై కబ్జా రాయుల్లాపరమవుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురుఅంటున్నారు. ఇదే చెరువును భైరవుని పల్లి చిన్న తండా చెరువు మాదారం గ్రామాలకు చెందిన కొందరు నేటికీ కబ్జాలు చేసి దర్జాగా సాగు చేస్తున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారని పలువురు ఫిర్యాధు దారులు ఆరోపిస్తున్నారు. కూసుమంచి మండలం తిరుమలయపాలెం కూసుమంచి ఖమ్మం రూరల్ మండలాలలో కూడా చెరువులతోపాటు ఎన్ఎస్పి సాగర్ కాలువలు సైతం బహిరంగంగా కబ్జా చేసినట్లు పరిసర గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
*మండలాలలో జిల్లాలలో హైడ్రా తరహా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా..?
కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో హైడ్రా అనే స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటుచేసి ఏవి రంగనాద్ ను ప్రత్యేక అధికారిగా నియమించి 3,500 మంది సిబ్బంది మూడు కమిషనర్ రేట్ల పరిధిలో ప్రభుత్వ భూములను పరిరక్షణ విపత్తుల నివారణ కార్యక్రమం కింద నేటికీ సుమారు 100 ఎకరాలను కబ్జా రాయుళ్ల చెంత నుండి విముక్తి కలిగించినట్లు ప్రభుత్వ నివేదికలో స్పష్టం చేస్తున్నాయి. కానీ ఖమ్మం జిల్లాలోని ఖమ్మం చుట్టుపక్కల ముదిగొండ,పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ కూసుమంచి నేలకొండపల్లి తిరుమలా యపాలెం మండలాలలో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురై ఫిర్యాదులు అందుతున్న గాని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది పంటల సీజన్లో ప్రజావాణి రెవిన్యూ సదస్సుల లో రైతులు వందలాదిగా ఫిర్యాదులు అందజేసిన గాని నామమాత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు పలువురు రైతులు బహిరంగం గానే ఆరోపిస్తున్నారు. ఒక అనధికారిక సమాచారం మేరకు వందల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జారాయుళ్ల చేతిలో బందీ అయ్యి కొన్నిచోట్ల సాగు చేస్తుండగా మరికొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయనేఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ముదిగొండ పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు కబ్జాలు గురైన చెరువు శిఖాలపై అందిన ఫిర్యాదులపై దృష్టి కేంద్రీకరించి పకడ్బందీచర్యలు తీసుకోని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని పలువురు సామాజిక కార్యకర్తలు ముక్త కంఠంతో కోరుతున్నారు.