బాలసాహిత్యానికి పుప్పాల చేస్తున్న కృషి అభినందనీయం

Aug 18, 2024 - 23:13
 0  13
బాలసాహిత్యానికి పుప్పాల చేస్తున్న కృషి అభినందనీయం

సూర్యాపేట జిల్లా కోదాడలో.....

బాలసాహిత్యానికి పుప్పాల చేస్తున్న కృషి అభినందనీయం ...

బాలసాహిత్యం తోనే సాహిత్య అభివృద్ధి...

బాలల చైతన్యంలో బారతవనం...

పుస్తకం నిలిచిపోతుంది ...

ఘనంగా భరతవనం పుస్తక ఆవిష్కరణ...

తెలంగాణ వార్త ప్రతినిధి..... బాలల సాహిత్యానికి ప్రముఖ బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి చేస్తున్న కృషి అభినందనీయమని  సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్, కాంతారావులు, సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు మోహనకృష్ణ  అన్నారు. కోదాడలో ఆదివారం పట్టణంలోని ఉద్యోగుల విశ్రాంత సంఘ కార్యాలయంలో ప్రముఖ బాల సాహితీవేత్త పుప్పాల సేకరించిన భారతవనం పిల్లల కథల పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బాలసాహిత్యం తోనే సాహిత్యాభివృద్ధి జరుగుతుందన్నారు. పిల్లలు కథల పుస్తకాలు చదివి వీజ్ఞానవంతులు కావడంతో పాటు నైతిక విలువలను పెంపొందించుకుంటారన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలను కథల పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలన్నారు. పుప్పాల సాహిత్యంపై ఇప్పటివరకు 18 పుస్తకాలను రచించాడని ఆయన సాహిత్యాబిరుచి నీ కొనియాడారు. కవులు రచయితలు కృషితోనే చరిత్ర వర్తమానం భవిష్యత్తు మూడు కాపాడబడుతున్నాయన్నారు. పుస్తకాన్ని చదవడంతోపాటు ఇతరులతో చదివించాలని కోరారు. అనంతరం పుస్తక రచయిత పుప్పాల కృష్ణమూర్తి మాట్లాడుతూ పిల్లల్లో సాహిత్య అభిరుచి పునాదుల కోసం పిల్లల కథలను ఇతివృత్తారంగా తీసుకుని రాస్తున్నానని అందులో భారతవనం ఒకటి అన్నారు ఒకటి అన్నారు. ఈ పుస్తకాన్ని బెల్లంకొండ రాజశేఖర్, ప్రశాంతి దంపతులకు అంకితం చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. పుస్తకాన్ని అందరూ ఆదరించాలని ఆయన కోరారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమం లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముత్యాలు,  బంగారు నాగమణి, నవతెలంగాణ పత్రిక ఉమ్మడి నల్గొండ జిల్లా మేనేజర్ పుప్పాల మట్టయ్య, ఉయ్యాల నరసయ్య, పలువురు సాహితీవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333